మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Venugopala Ashtakam – శ్రీ వేణుగోపాలాష్టకం


కలితకనకచేలం ఖండితాపత్కుచేలం
గళధృతవనమాలం గర్వితారాతికాలమ్ |
కలిమలహరశీలం కాంతిధూతేంద్రనీలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 1 ||

వ్రజయువతివిలోలం వందనానందలోలం
కరధృతగురుశైలం కంజగర్భాదిపాలమ్ |
అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 2 ||

ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం
కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్ |
ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 3 ||

శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం
దితిజతతికరాలం దివ్యదారాయితేలమ్ |
మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 4 ||

మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం
జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్ |
సకలమునిజనాళీమానసాంతర్మరాళం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 5 ||

అసురహరణఖేలనం నందకోత్క్షేపలీలం
విలసితశరకాలం విశ్వపూర్ణాంతరాళమ్ |
శుచిరుచిరయశః శ్రీధిక్కృత శ్రీమృణాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 6 ||

స్వపరిచరణలబ్ధ శ్రీధరాశాధిపాలం
స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళమ్ |
గురుతరభవదుఃఖానీక వాఃపూరకూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 7 ||

చరణకమలశోభాపాలిత శ్రీప్రవాళం
సకలసుకృతిరక్షాదక్షకారుణ్య హేలమ్ |
రుచివిజితతమాలం రుక్మిణీపుణ్యమూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 8 ||

శ్రీవేణుగోపాల కృపాలవాలాం
శ్రీరుక్మిణీలోలసువర్ణచేలామ్ |
కృతిం మమ త్వం కృపయా గృహీత్వా
స్రజం యథా మాం కురు దుఃఖదూరమ్ || 9 ||

ఇతి శ్రీ వేణుగోపాలాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.